Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

నిస్సంగత్వే జీవన్ముక్తిః

దేహత్యాగానంతరం స్వర్గానికి వెళ్ళాలని కోరుకోవడం మంచిది. కాని ప్రతిమనిషి కూడ జీవన్ముక్తిః సాధించడానికి కృషి చేయాలి. శరీరాపాతానంతరం మోక్షాన్ని సంపాదిస్తామని వటం ఆత్మవంచనమే. మరణానంతరం ఈ లోకం కంటే 'మంచిలోకానికి వెళ్ళితే వెళ్ళవచ్చును. కానీ చేసుకొన్న పుణ్యం తీరిపోతే ఎంతటివారైనా, దివినుండి భువికి దిగవలసినదే. జన్మరాహిత్యం కోరుకొనేవారు కామక్రోధలోభ##ద్వేషములను విసర్జించాలి. జననమరణ రూపంలో వున్న ఈ సంసార విషవలయంనుంచీ బయట పడటానికి వేదములు చక్కని రాజమార్గాన్ని సూచించినవి.

మన ఉపనిషత్తులు, తత్త్వదర్శనములు, విదేశీయులను కూడా ఆకరించుచున్నవి. మరి ఏ ఇతర దేశముకంటే, ఆర్యావర్తమైన భారతభూమిలో ఇంతమంది యోగులు, జ్ఞానులు, ఋషులు, భక్తులు, జన్మించారంటే, అది వేదమాహాత్మ్యమే. జన్మకుకారణం కామం. కామసంహారంవల్లనే మృత్యుంజయత్వం సిద్ధిస్తుంది. మృత్యువును జయించినవానికి పునర్జన్మ ప్రసక్తిలేదు. మన సర్వసమారంభములూ కామసంకల్ప వర్జితములు కావాలి.

దేశంలో వున్న జనమంతా మహరలా, యోగులూకాజాలరు. కోటిలో ఒకడు యోగి ఐనా చాలు.

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః||

సర్వభూతముల యందును ఆత్మబుద్ధికలిగి అనురాగం వరించేవాడు జీవన్ముక్తిని సాధించగలడు. అట్టివాడే - 'సుహృదం సర్వభూతానాం, సర్వభూత హితేరతాః' - అని పిలువ బడుటకు అర్హుడు. రాముడు అట్టి సర్వసత్త్వ మనోహరుడు.

ప్రాపంచిక వ్యవహారాలు మనకు ఉరిత్రాళ్ళ వంటివి. వాటిని ఛేదించి, వానినుండి మనం బయటపడాలి. దీనికై అహర్నిశలు నిర్ణిద్రకృషి చేయాలి. నిస్సంగత్వాన్నీ, అనాశక్తినీ అలవరుచుకోవాలి. అపుడే జీవన్ముక్తి కరతలామలకం కాగలదు. జీవన్ముక్తి అనే హర్మ్య చంద్రశాలకు మొదటి సోపానం నిస్సంగత్వం.

సర్వజగదంత ర్యామి యైన పరవస్తువు ఏమో ఒక్కటే, అతడే సర్వవ్యాపకుడైన విష్ణువు. పరమేశ్వరుడు. ఎవరు ఏ విధంగా పూజించినా, ఆ పూజలన్నీ ఆయనకే చెందుతవి.

'యే యధా మాం ప్రపద్యంతే, తాం స్తధైవ బజామ్యహం'

'ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి.'

'ఆకాశా త్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం

సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి.'

'తస్య భాసా సర్వ మిదం విభాతి.'

పై వాక్యాలన్నీ ఈ విషయాన్నే ఘోషిస్తున్నవి. పిల్లలు బొమ్మలతో ఆడుకొంటారు. ఇది చింతకాయ, అది నిమ్మకాయ ఇది అదటిపండు. అది మామిడిపండు అని భావిస్తారు. వాస్తవానికి అవి అన్నీ మన్నుతోనో చెక్కతోనో చేయబడినవే. రూపాలు వెర్వేరైనా లోపలి పదార్థమేమో ఒక్కటే.

మానవ జాతికి ధర్మమార్గాన్ని ఉపదేశించి కర్తవ్య పరాయణం చేయుటకే ఆది శంకరులు అవతరించారు. వారి బోధలను అనుసరించి, ఆచార శీలురమైనామంటే, జీవన్ముక్తిని సాధించడానికి మనకూ అవకాశ ముంటుంది.

( 9 - 11 )


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page